Home / China
ఐక్యరాజ్యసమితి విడుదల చేసినవరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2022 నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా నేడు 8 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లు, 2050లో 9.7 బిలియన్లు మరియు 2100లో 10.4 బిలియన్లు పెరుగుతుందని అంచనా వేయబడింది.
కరోనా మహమ్మరిని ప్రపంచానికి వ్యాప్తి చేసిన చైనాలో తిరిగి కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా చైనా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 10,729 కొత్త కేసులు నమోదైన్నట్లు చైనా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో 1209మందికి లక్షణాలు కనపడుతున్నాయని అధికారులు తెలిపారు.
చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి ఊపందుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐ - ఫోన్ప్యాక్టరీ చుట్టుపక్కల లాక్డౌన్ విధించారు అధికారులు. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. అధికారులు కఠిమైన నిబంధనలు అమలు చేస్తారన్న ఆందోళనతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులలో ఒకరిగా ఆవిర్బవించాడు. జిన్ పింగ్ మావో జెడాంగ్ తర్వాత చైనా యొక్క అత్యంత శక్తివంతమైన పాలకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
షీజిన్పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో తెలిపారు.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పోయిందనుకున్న మహమ్మారి మరోసారి విరుచుకుపడుతుంది. చైనాలో రోజురోజుకీ భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దానితో వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు పట్టణాల్లో లాక్డౌన్ విధించింది.
వీగర్ ముస్లింల స్థితిగతులపై చైనాకు వ్యతిరేకంగా చేసిన మానహ హక్కుల తీర్మానాన్ని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది.
ఇరాన్ నుండి చైనాకు వెళ్లుతున్న ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భారత్ వైమానిక అధికారులు అప్రమత్తమైనారు. సాంకేతిక కారణాలతో భారతదేశంలో చైనా వెళ్లే విమానాన్ని అత్యవసరంగా దింపేందుకు అనుమతి నిరాకురించారు
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ విజృంభిస్తున్న సమయంలో ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులకు పలు సూచనలు చేస్తున్నాయి. అయితే, విదేశీయులతో పాటు ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వారి చర్మాన్ని తాకొద్దని తాజాగా చైనాలోని ఓ ఉన్నతాధికారి హెచ్చరించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
భారత్ దెబ్బకు చైనా కంపెనీల అబ్బా అంటున్నాయి. ఇన్నాళ్లూ యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో వ్యాపారం సాగించాయి. కాగా తాజా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీల వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమ వ్యాపారం చేస్తున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో బెంబేలెత్తిన కొన్ని చైనా కంపెనీలు భారత్ కు గుడ్ బై చెప్తున్నాయి.