Home / China
అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యటలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఈ నెల 25 నుంచి27 వరకు తైపీ పర్యటన చేపట్టారు.
కరోనా సమయంలో భారత్‌కు వచ్చి ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయిన విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కొనసాగించవచ్చని చైనా తెలిపింది. వీరితోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు చైనాకు వచ్చేందుకు వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా ప్రకటించింది.
కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్‌తో కరోనాను అదుపు చేస్తున్నారు.
చైనాలో ఓ ఉద్యోగికి కౌగిలింత ఖరీదైన వ్యవహారంగా మారింది. తన సహోద్యోగిని కౌగలించుకోవడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తన కోలిగ్ గట్టిగా కౌగిలించుకోవడం వల్ల తన పక్కటెములు పటపటమంటూ విరిగాయని ఆమె కోర్టుకు విన్నవించింది.
చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటంతో భారత్ వ్యతిరేకతను తెలిపింది.
సమరానికి సై అంటోంది తైవాన్. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అడుగు పెట్టిన వెంటనే చైనా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. చెప్పిన ప్రకారమే తైవాన్ తీర ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. తైపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించింది.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్‌లో పర్యటించినందుకుగానూ ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం నిరసన వ్యక్తం చేసింది.
చైనా పొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలతో బరితెగిస్తోంది. తాజాగా భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను ‘పంగ్డా’ అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్
ప్రపంచ జనాభాలో భారత్ రికార్డు బద్దలు కొట్టనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి జనాభాలో చైనాకు కూడా మించిపోతుందని తాజాగా విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. యూనైటెడ నేషన్స్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సొషల్ ఎఫైర్ పాపులేషన్ డివిజన్ ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్ 2022 నివేదికలో ఈ అంశాలను పొందుపర్చింది.
ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా చేసిన విమర్శలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. దలైలామా భారత్‌లో గౌరవ అతిథి అని, ఆయనకు భారత్‌లోనూ అనుచరులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.