Last Updated:

Chandrababu’s investigation: రెండవరోజూ కొనసాగుతున్న చంద్రబాబు విచారణ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం చంద్రబాబును ప్రశ్నిస్తోంది.

Chandrababu’s investigation: రెండవరోజూ కొనసాగుతున్న చంద్రబాబు విచారణ

Chandrababu’s investigation:స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం చంద్రబాబును ప్రశ్నిస్తోంది. విచారణకు ముందు చంద్రబాబుకు యథావిధిగా మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో రోజు విచారణను ఉదయం 9.30కి సీఐడీ అధికారులు ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. నిన్నటిలానే.. గంటగంటకు ఐదు నిమిషాలు బ్రేక్.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రెండో రోజు విచారణ కొనసాగుతోంది. న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

జైలు వద్ద భారీ భద్రత..(Chandrababu’s investigation)

చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఆక్టోపస్, సివిల్ పోలీస్ బృందాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. నేటితో చంద్రబాబు రెండు రోజుల విచారణ ముగియనుంది. అంతనరం సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు సీల్డు కవర్‌లో నివేదికను అందించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన తీరును, చంద్రబాబు నుంచి సేకరించిన సమాచారాన్ని కోర్టుకు అందించనుంది. ఇవాళ్టితో చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌ ముగియనున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా..? లేక ఏసీబీ కోర్టు మళ్లీ రిమాండ్ పొడగిస్తుందా..? అనేది ఉత్కంఠ రేపుతోంది.

చంద్రబాబు మొదటి రోజు విచారణలో భాగంగా సిఐడి అధికారులు 50కిపైగా ప్రశ్నలు సంధించారని తెలిసింది. కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాలు మాయంపై చంద్రబాబుని ప్రశ్నించారు. సుమన్ బోస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?, డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు? సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి? నిధుల విడుదల చేసే ముందు ప్రొసీర్స్ ఎందుకు ఫాలో కాలేదు?.. ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు?. యూపీ కేడర్ ఐఏఎస్ అధికారిని డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు.? 3వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు ? ఈ కుంభకోణంలో ఆచ్చెన్నాయుడు పాత్ర ఏంటి? 3వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ రాయితీగా ఎందుకు మారింది.? 330 కోట్ల డబ్బులు దోచుకునేందుకే 3వేల 356 కోట్ల రూపాయలకి ప్రాజెక్టు అంచనాలు పెంచారా? సుమన్ బోస్‌తో సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి.? ఇలా వరుసగా సిఐడి అధికారులు ప్రశ్నలు అడిగారని తెలిసింది.

ఇవి కూడా చదవండి: