Home / Central government
అరుణాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని శనివారం నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అసలైన ఔషధ ఉత్పత్తులను కనుగొనడంలో మరియు ట్రేస్ చేయడంలో సహాయపడటానికి, ఔషధాల ప్యాకెట్లపై బార్ కోడ్లు లేదా క్యూఆర్ కోడ్లను ప్రింట్ చేయమని లేదా అతికించమని కేంద్రం త్వరలో ఔషధ తయారీదారులను కోరవచ్చని తెలుస్తోంది.
కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన పై క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు మరియు సీఈవో దీపక్ షెనాయ్ స్పందించారు. ఇది "చెడు నిర్ణయం". కోవిడ్ ముగిసినందున ఉచితంగా ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 2023 నుండి ప్యాసింజర్ వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కేంద్రం తప్పనిసరి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పధకం కేంద్రం యొక్క జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపికైంది. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం ఈ పధకం లక్ష్యం.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ వ్యక్తి ఆయన.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మరియు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)లో 4 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా రెండు రౌండ్ల దాడులు మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పిఎఫ్ఐ) కు చెందిన 240 మంది సభ్యులని అరెస్టు చేసిన తరువాత కేంద్రం తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణల పై ఐదేళ్ల పాటు పిఎఫ్ఐ ను నిషేధించింది.
విద్వేషాలు, మార్ఫింగ్, అసత్య వార్తల వ్యాప్తితో సమాజంలో అస్ధిరత ప్రేరేపిస్తున్న ఘటనలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. అందులో భాగంగా 10 యూట్యూబ్ ఛానెల్స్ కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసిన్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఎస్సీ కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికుల కోసంssc cgl స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2022కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.