Home / Central government
ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తీసుకొంటున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట విమర్శలు తలెత్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగులను తొలగించడం అంతర్జాతీయంగా పెను సంచలన సృష్టించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని అన్నారు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశానికి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉన్న కార్యాలయాల్లో పడి ఉన్న స్క్రాప్ ను రూ. 254 కోట్లకు విక్రయించి 37 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని క్లియర్ చేసింది.
గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు
రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో 15 రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసి వేస్తున్నట్లు టెక్స్ టైల్స్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. పరిశ్రమను ఆర్ధిక మాంద్యం వెంటాడుతుందని ఆవేదన వెలిబుచ్చారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం తెలంగాణాకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు .రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ మీడియాతో పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని మూడు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని శనివారం నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అసలైన ఔషధ ఉత్పత్తులను కనుగొనడంలో మరియు ట్రేస్ చేయడంలో సహాయపడటానికి, ఔషధాల ప్యాకెట్లపై బార్ కోడ్లు లేదా క్యూఆర్ కోడ్లను ప్రింట్ చేయమని లేదా అతికించమని కేంద్రం త్వరలో ఔషధ తయారీదారులను కోరవచ్చని తెలుస్తోంది.