Home / Bihar
బీహార్ లో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నీతీశ్ కుమార్ విజయం సాధించారు. అయితే విశ్వాస పరీక్ష జరిగే సమయంలో ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
లాండ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు చెందిన సంస్థ నిర్మించినట్లు భావిస్తున్న గురుగ్రామ్‌లోని నిర్మాణంలో ఉన్న మాల్తో సహా రెండు డజనుకు పైగా ప్రదేశాలలో సీబీఐ బుధవారం సోదాలు నిర్వహించింది.
తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన రెండు వారాల తర్వాత బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ.. తన హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ, తాను పక్షపాతం చూపనని అన్నారు.
బీహార్‌లో లాలూ ప్రసాద్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిలాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు సునీల్ సింగ్‌తో సహా ఆర్జేడీ నేతలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది.
బీహార్‌లోని మిథిలమఖానా కేంద్ర ప్రభుత్వంచే భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్‌ని అందుకుంది. దీనిని ఫాక్స్ నట్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిని సాధారణంగా పెంకుతో కొట్టి, ఎండబెట్టి, ఆపై మార్కెట్లో విక్రయిస్తారు.
బావమరిది మంత్రిగా ఉన్నాడు. మంత్రి అంటే సమావేశాలు సాధారణమేకదా. అలాగే అతను కూడ ఈ సమావేశం నిర్వహించాడు. అయితే ఈ సమావేశానికి అతని బావ హాజరయ్యాడు. ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయిన అతడికి ఎటువంటి అధికారిక పదవి లేదు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కూటమి భాగస్వామి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎక్కువ మంత్రిపదవులు లభించాయి. కాంగ్రెస్‌తో సహా మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 31 మంది మంత్రులను
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నేడు ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారంపై స్పష్టత లేదు. నితీష్ కుమార్ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ద్రోహం చేశారని ఆరోపిస్తూ బీజేపీ
నితీష్ కుమార్ మంగళవారం బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమార్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను రాజ్ భవన్లో కలుసుకున్నారు మరియు రాష్ట్రంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ముగించినందుకు గుర్తుగా ఉన్నత పదవికి రాజీనామా లేఖను సమర్పించారు
బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమయం కోరినట్లు సమాచారం. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య జరగొచ్చు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కలిసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు