Home / Bihar
బీహార్‌లోని ముజఫరా పూర్ పట్టణంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 14 లక్షల రూపాయలు దోచుకుపోయారు. సదర్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోబర్‌షాహి బ్రాంచిలో ఈ సంఘటన జరిగింది.
ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుండి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించిన్నట్లు చెప్పడమే అందుకు కారణమన్నారు. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని తెలుసన్నారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్ సి టిసి ) కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును శనివారం ఆశ్రయించింది. ఒక ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్ సి టి సి హోటళ్ల నిర్వహణ ఒప్పందాల మంజూరు కేసులో తేజస్వి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరింది.
ప్రత్యేక హోదా అంశమే ప్రధానంగా 2024లో ఎన్నికల అజెండాగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తానాయా అంటే అవుననేలా బీహార్ సిఎం నితీశ్ కుమార్ మాట్లాడుతున్నారు
తల్లీపిల్లల అనుబంధం గురించి చెప్పనక్కర్లేదు. కొడుకుకు ఆకలేస్తుందేమోనని ముందే కొసరికొసరి తినిపిస్తుంటారు. కానీ ఓ అమ్మ అన్నం పెట్టలేదని 8 ఏళ్ల కుమారు పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మరి చూసేద్దామా..
బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తాను తన శాఖలో 'దొంగలకు సర్దార్' నంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ రైతులను ఆదుకుంటామనే పేరుతో దాదాపు రూ.200 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ అన్వర్ అహ్మద్ కుమారుడు అస్ఫర్ పాట్నాలో శుక్రవారం రాత్రి డీఎస్పీ అశోక్ సింగ్ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేశాడు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించారు.
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దానాపూర్ సమీపంలో గంగానదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా డీఎస్పీ కావాలని తను కన్నకలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా రాత్రింబవళ్లు కష్టపడింది. తన పోరాట పటిమకు విధి సైతం తలవంచడంతో కానిస్టేబుల్ అనుకున్నది సాధించింది.