Home / Bihar
ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను ఆస్పత్రి నర్సులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
బీహార్‌లో బహిరంగంగా మందుకొడుతూ పట్టుబడిన వీఐపీలను ఉంచడానికి రాష్ట్రప్రభత్వం వీఐపీ సెల్స్ ను నిర్మించింది. ఇందులో రెండు బెడ్స్, సోఫా, టేబుల్, ఎయిర్ కండిషనర్లు ఉంచారు.
భాగ్యనగరంలో భారీ సెల్ ఫోన్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పొడే ముఠా పనిగా తేల్చారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులపై కాల్పులకు కూడా నిందుతులు పాల్పొడ్డారు. చివరకు హైదరాబాదు పోలీసులకు చిక్కారు
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
బీహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఒక విద్యార్దిని ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరగా రేపు కండోమ్స్ కూడా అడుగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వారిరువు వరుసకు అన్నా చెల్లెళ్లు. ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తోన్న క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దానితో బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే ఏడునెలల గర్బం అని తెలిసి భయపడి పారిపోయి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ ఉదతం బిహార్లో చోటుచేసుకుంది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిందన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పై విరుచుకుపడ్డారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ప్రతిపక్షాలన్నీ సిద్దమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీహార్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమవనున్నారు.
బీహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల వల్లే రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలు విజృంభిస్తున్నాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు
బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడడంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు