Home / Bandi Sanjay
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు రెడీ అయ్యారు. నాలుగు పాదయాత్రలకు భిన్నంగా ఈసారి, నిత్యం రెండు వర్గాల మధ్య అలర్లు జరిగే ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభించడం ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఐదో విడతలో భైంసా నుండి కరీంనగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గద్దె దించేంతవరకు తాను నిద్రపోయేది లేదని పదే పదే భాజపా పెద్దలపై విరుచుక పడుతూ జాతీయ పార్టీని స్ధాపించేందుకు సిద్ధమైన సీఎం కేసిఆర్ కసరత్తు డిసెంబర్ కు వాయిదా పడిన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికతో పాటు జాతీయ పార్టీ విధి విధానాలపై పూర్తి స్ధాయి ఎన్నికల కమీషన్ కు సమర్పించేందులో ఆలస్యమే కారణంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతుంది బీజేపీ. ఇందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.
సీఎం కేసిఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని కావాలనే మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిషేదిత ఫిఎఫ్ఐ సంస్థను కొందరు టీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారన్నారు.
చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అంతకుమించి మరీ అసభ్య పదజాలాలు ఇది నేటి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఉచ్ఛరిస్తున్న మాటలు. శాసనసభ హుందాతనాన్ని మరిచి మరీ రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూనే పొరుగు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కిన ఘటన తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకొనింది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయన మూడు దఫాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం పై రగడ మొదలయింది. దీనిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత షెడ్యూల్ ఖరారైంది. 10 రోజులపాటు 9 నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర 10 రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు.