Home / Bandi Sanjay
ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పై తాను అసంతృప్తిగా ఉన్నట్టు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. జాతీయ నాయకత్వంతో తనకు ఎలాంటి సమస్య లేదని,
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన బండి సంజయ్ పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తి చేసుకుంది.జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లెలో బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా సంజయ్ అప్పిరెడ్డిపల్లెలో పైలాన్ ఆవిష్కరించారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్రలో టిఆర్ఎస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై బండి సంజయ్ ను ప్రశ్నించారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండాలని ఆ పార్టీ నేతలు నిర్దేశించారు. ఇందులో భాగంగా పల్లె గోస- బీజేపీ భరోసా పేరుతో నేటి నుంచి బైక్ ర్యాలీ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.