Home / Bandi Sanjay
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో బండి ప్రత్యేక పూజలు చేశారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాలకి చెందిన డికె అరుణని ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌కి కార్యదర్శిగా చోటు దక్కింది.
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్ష మార్పుపై జరుగుతున్న చర్చ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తమ పార్టీలో లీకులకు తావుండదని బండి సంజయ్ అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. చేతగాని బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్‌ని గెలిపించాలని ఎంఐఎం పార్టీ చూస్తోందని, ఆ పార్టీకి దమ్ముంటే తెలంగాణలోని మొత్తం స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఏ రాష్ట్రంలో నైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని.. కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్నారు.
Bandi Sanjay: అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
Bandi Sanjay: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లడంపై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకటించింది.