Home / Ap latest news
Ap Cm Jagan: రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే.. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెనాలిలో వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.
Nandyal Murder: పాణ్యం మండలంలో జరిగిన పరువు హత్య కేసు కీలక మలుపు తిరుగుతుంది. కన్న తండ్రే కుమార్తెను కిరాతకంగా హతమార్చాడు. తల, మొండెం వేరు చేసి అటవీ ప్రాంతంలోని లోయలో పడేశాడు. ఈ హత్యలో అదే గ్రామానికి చెందిన మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Nandyal Murder: ఆంధ్రప్రదేశ్ లో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు గొంతు కోసి.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nara Lokesh on Ntr: యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మరాయి. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతోంది.
Ys Avinash Reddy: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
Chandrababu: వైఎస్ వివేకా హత్యపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయడు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి.. ఆ విషయాన్ని దాచడానికి అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
Kanna Laxmi Narayana: కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ సీనియర్ నేత తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెదేపా అధినేత.. చంద్రబాబు నాయుడి సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో చేరటానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
శివరాత్రి వేళ ఆ శివయ్యను పూజించుకొని.. తిరునాళ్ళను వీక్షించి తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని విధి కాటేసింది. అయిన వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరితో కలిసి అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారంతా కొద్ది గంటల్లోనే ఇంటికి చేరుకుంటాం అనుకునే లోపే వారి జీవిత ప్రయాణం అకాలంగా ముగిసింది.
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు.