Home / ap cm ys jagan
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహిస్తున్న రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. అదే విధంగా బహిరంగ సభలో మాట్లాడుతూ..
ఏపీ సీఎం జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై.. తమ్మినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కుమారుడి పెళ్లి త్వరలో జరగనుంది. అయితే రాపాక తన కుమారుడి వివాహానికి ఏర్పాట్ల విషయంలో ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి కోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. అదే విధంగా వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో రాయించారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని.. వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి లోనో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కడలి నని విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు.
సైకిల్‌ను చంద్రబాబు, లోకేష్‌లు తొక్కలేకపోతున్నారని.. దానికి తుప్పు పట్టిందని రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
నా జీవితంలో రాబోయే ఐదేళ్లు మీరు ఊహించని విధంగా పనులు చేసి.. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్లీ ట్రాక్ పెట్టి .. పూర్వ వైభవాన్ని తెప్పించే బాధ్యత తీసుకుంటానని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద జరుగుతున్న మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.
ప్రపంచానికి తెలుగు వారిని పరిచయం చేసింది ఎన్టీఆర్. రాముడు అయినా భీముడు అయినా ఎన్టీఆరే. ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని నారా లోకేశ్ అన్నారు. రాజమండ్రి వేమగిరి వద్ద జరుగుతున్న
రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "మహానాడు - 2023 " కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు
సీఆర్డీఏ పరిధిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద 'నవరత్నాలు—పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఈ పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా 1402 ఎకరాలలో , 25 లేఅవుట్స్ గా విభజించి.. దాన్ని మొత్తాన్ని ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు.
నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.