Home / ap cm ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.
వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి బాలినేని తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి పార్టీ పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. నార్పల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో
వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలానే నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై రు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాగా మంత్రి సీదిరి అప్పల రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌పై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ అయ్యింది.
మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా ఆస్తులు ఉన్నవారు ఎవరు? అత్యల్ప ఆస్తులు ఉన్నవారు ఎవరు.. అత్యధికంగా కేసులు ఎవరిపై ఉన్నాయి.. అప్పులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి వంటి వివరాలను తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశం లోని 28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని
ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఈబీసీ నేస్తం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ రెండేళ్లలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా రూ. 1258 కోట్లు జమ చేసినట్టుగా సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టుగా సీఎం జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి అధికారులు ప్రొటోకాల్‌లో ప్రాధాన్యం ఇవ్వలేదు..