Home / Andhra Pradesh
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని పవన్ మండిపడ్డారు.
పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంది. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
రాయలసీమ జిల్లాలను వానలు వదలడం లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జోరు వానతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎంపీ మాధవ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ వీడియో కాల్ లో ఉంది. ఆ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎంపీ తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోమారు విషవాయువు లీకై అస్వస్థకు గురైన బాధితులు కోలుకుంటున్నారన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా, మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందన్నారు.