Last Updated:

WTC Points Table: ఆసక్తికరంగా మారిన డబ్ల్యూటీసీ పాయింట్స్‌.. నంబర్ వన్ ఏ జట్టంటే?

WTC Points Table: ఆసక్తికరంగా మారిన డబ్ల్యూటీసీ పాయింట్స్‌.. నంబర్ వన్ ఏ జట్టంటే?

World Test Championship Points Table: డబ్ల్యూటీసీ పాయింట్స్‌ టేబుల్‌ ఆసక్తికరంగా మారింది. అడిలైడ్ టెస్ట్ విజయంతో ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆసీస్ ఆనందాన్ని గంటల వ్యవధిలోనే ఆవిరి చేస్తూ.. ఫస్ట్ ర్యాంక్‌ను దక్షిణాఫ్రికా తన్నుకుపోయింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకోవటం ద్వారా తన పర్సంటేజీని (63.33 శాతం) మెరుగుపరుచుకుని టాప్‌-1లోకి చేరింది.

ఇక ఆస్ట్రేలియా 60.71, భారత్ 57.29 శాతాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పెర్త్‌ టెస్టు గెలుపుతో మొదటి స్థానంలో నిలిచిన భారత్.. అడిలైడ్ టెస్ట్ పరాజయంతో మూడో స్థానానికి పడిపోయింది. శ్రీలంక, ఇంగ్లండ్ 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. డబ్ల్యూటీసీ సైకిల్‌లో మ్యాచ్‌లు ముగిసేనాటికి ఈ జాబితాలో టాప్‌ 2లో ఉన్న జట్లు ఫైనల్‌ ఆడతాయి. దీంతో మూడోసారి మనదేశం ఫైనల్‌‌కు వెళ్లాలంటే ఆస్ట్రేలియాతో మిగిలిన 3 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: