Last Updated:

CSK vs GT Final: సాయి సుదర్శన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై టార్గెట్ @ 215

CSK vs GT Final: ఐపీఎల్ 2023లో భాగంగా ఫైన‌ల్ మ్యాచ్‌ అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌లు  నువ్వా నేనా అన్నట్టు తల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి గుజరాత్ టీం నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది.

CSK vs GT Final: సాయి సుదర్శన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై టార్గెట్ @ 215

CSK vs GT Final: ఐపీఎల్ 2023లో భాగంగా ఫైన‌ల్ మ్యాచ్‌ అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌లు  నువ్వా నేనా అన్నట్టు తల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి గుజరాత్ టీం నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది. 3 వికెట్ పై ఆడిన సాయి సుదర్శన్ సూపర్ ఇన్నింగ్స్ బాదాడు. 46 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అందులో 6 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. వృద్ధిమాన్ సాహా సైతం హాఫ్ సెంచరీ(54) పూర్తి చేశాడు. మిగిలిన బ్యాటర్లైన గిల్ 39, హార్ధిక్ పాండ్యా 21 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు పతిరణ రెండు వికెట్లు తీయగా, చాహర్, జడేజా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 

మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. సీఎస్కే మ్యాచ్ గెలిచి తన ఖాతాలో ఐదోసారి కప్ కొట్టి ముంబై ఇండియ‌న్స్ పేరిట ఉన్న అత్య‌ధిక టైటిళ్ల రికార్డును స‌మం చేస్తుందా లేదా గతేడాది ఐపీఎల్ విన్నర్ గా నిలిచిన గుజ‌రాత్ జ‌ట్టు వ‌రుస‌గా రెండో సారి కూడా టైటిల్ అందుకుంటుందా..? అనేది వేచి చూడాలి.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 29 May 2023 09:59 PM (IST)

    వర్షం వల్ల మరోసారి మ్యాచ్ కు ఆటంకం

    వర్షం వల్ల మరోసారి మ్యాచ్ కు ఆటంకం. ఛేజింగ్ ప్రారంభించిన చెన్నై 3 బంతుల్లో 4 పరుగులు చేయగా భారీ గాలి వాన వల్ల మ్యాచ్ నిలిచింది.

  • 29 May 2023 09:49 PM (IST)

    ఛేజింగ్ స్టార్ట్

    క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఉన్నారు. మొదటి ఓవర్ షమి బౌలింగ్ వేస్తున్నాడు.

  • 29 May 2023 09:43 PM (IST)

    మ్యాచ్ కు వరుణుడి ఆటంకం

    సెకెండ్ ఇన్నింగ్స్ కు వరుణుడి ఆటంకం. ఛేజింగ్ మ్యాచ్ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యే ఛాన్స్

  • 29 May 2023 09:14 PM (IST)

    చెన్నై టార్గెట్ 215

    నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టీం నాలుగు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది. దానితో చెన్నై టార్గెట్ 215 పరుగులుగా ఉంది.

  • 29 May 2023 09:11 PM (IST)

    సెంచరీకి దగ్గర్లో సుదర్శన్ ఔట్

    సెంచరీకి నాలుగు పరుగులు ఉండగా సాయి సుదర్శన్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్ స్కోర్ 212/3.

  • 29 May 2023 08:56 PM (IST)

    సుదర్శన్ బౌండరీల వర్షం

    వేసిన ప్రతి బాల్ ను బౌండరీగా మలచి సాయి సుదర్శన్ పరుగుల వరద పారిస్తున్నాడు. 17 ఓవర్లు ముగిసే సరికి జీటీ స్కోర్ 173/2.

  • 29 May 2023 08:47 PM (IST)

    సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ

    33 బంతుల్లో 52 పరుగులు చేసి సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం జీటీ స్కోర్ 148/2.

  • 29 May 2023 08:44 PM (IST)

    సాయి సుదర్శన్ సిక్సుల మోత

    వరుస పెట్టి సిక్సులు బాదుతున్న సాయి సుదర్శన్. 15 ఓవర్లు ముగిసే సరికి ప్రస్తుతం జీటీ స్కోర్ 143/2

  • 29 May 2023 08:38 PM (IST)

    సాహా ఔట్

    39 బంతుల్లో 54 పరుగులు చేసి సాహా ఔట్ అయ్యాడు. చాహర్ బౌలింగ్లో సాహా పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ప్రస్తుతం జీటీ స్కోర్ 131/2.

  • 29 May 2023 08:32 PM (IST)

    సాహా హాఫ్ సెంచరీ

    36 బంతుల్లో వృద్దిమాన్ సాహా 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం గుజరాత్ స్కోర్ 117/1.

  • 29 May 2023 08:19 PM (IST)

    10 ఓవర్లు: గుజరాత్ టైటాన్స్ స్కోర్ 86/1

    10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ స్కోర్ 86/1. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, సాహా ఉన్నారు.

  • 29 May 2023 08:07 PM (IST)

    శుభ్ మన్ గిల్ ఔట్

    గుజరాత్ టైటాన్స్ మొదటి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫాంలో ఉన్న హిట్ మ్యాన్ శుభ్ మన్ గిల్ పెవిలియన్ చేరాడు. జడేజా బౌలింగ్లో 20 బంతుల్లో 39 పరుగులు చేసి గిల్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం జీటీ స్కోర్ 68/1. క్రీజులో సాహా, సాయి సుదర్శన్ ఉన్నారు.

  • 29 May 2023 08:03 PM (IST)

    గిల్ జస్ట్ మిస్

    జడేజా బౌలింగ్లో శుభ్ మన్ గిల్ రన్ అవుట్ అయ్యే ఛాన్స్ ను తృటిలో తప్పించుకున్నాడు.

  • 29 May 2023 08:01 PM (IST)

    పవర్ ప్లే: గుజరాత్ స్కోర్ 62/0

    పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ స్కోర్ 62/0. క్రీజులో సూపర్ ఫాంలో శుభ్ మన్ గిల్, సాహా ఉన్నారు.

  • 29 May 2023 07:54 PM (IST)

    గిల్ బౌండరీల మోత

    గిల్ వరుసపెట్టి బౌండరీలతో చెలరేగుతున్నాడు. ప్రస్తుతం జీటీ స్కోర్ 46/0

  • 29 May 2023 07:43 PM (IST)

    బౌండరీలు బాదుతున్న సాహా

    మూడో ఓవర్లో సాహా చెలరేగుతున్నాడు వరుసగా బౌండరీలు బాదుతున్నాడు. ప్రస్తుతం గుజరాత్ స్కోర్ 22/0.

  • 29 May 2023 07:36 PM (IST)

    మొదటి ఓవర్ నాలుగు రన్స్

    మొదటి ఓవర్ ముగిసేసరికి జీటీ టీం వికెట్ నష్టపోకుండా నాలుగు రన్స్ స్కోర్ చేసింది. క్రీజులో శుభ్ మన్ గిల్, సాహా ఉన్నారు.

  • 29 May 2023 07:32 PM (IST)

    మొదటి ఓవర్ దీపక్ చాహర్

    మొదటి ఓవర్ బౌలింగ్ వేస్తున్న దీపక్ చాహర్. క్రీజులో సాహా, శుభ్ మన్ గిల్ ఉన్నారు.

  • 29 May 2023 07:15 PM (IST)

    తుది జ‌ట్లు ఇవే

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు

    రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్‌), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

    గుజరాత్ టైటాన్స్ తుది జ‌ట్టు

    వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

  • 29 May 2023 07:15 PM (IST)

    చెన్నై ఫీల్డింగ్

    టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దానితో గుజరాత్ బ్యాటింగ్ కు దిగనుంది.