Baby Movie Review : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ నటించిన చిత్రం “బేబీ”. ఇక ఈ సినిమాలో యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేయగా.. విరాజ్ అశ్విన్ కీలకపాత్ర చేశాడు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డు అందుకున్న “కలర్ ఫోటో” సినిమాకు సాయి రాజేష్ రైటర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో పాటు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నేడు ( జూలై 14, 2023 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆడియన్స్ ని ఏ రేంజ్ లో మ్యాజిక్ చేసిందో మీకోసం ప్రత్యేకంగా.. రివ్యూ, రేటింగ్.. !
సినిమా కథ..
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైష్ణవి(వైష్ణవి చైతన్య) స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు. ఆనంద్ అంటే వైష్ణవికి చంచేంత ప్రేమ. ఆనంద్ కూడా ఆమెని అంతకు మించి ప్రేమిస్తాడు. ఆనంద్‌కి చదువు రాదు, టెంన్త్ ఫెయిల్. పైగా తండ్రి లేడు, అమ్మ మూగది. చదివించే స్తోమత లేదు. దీంతో చదువు ఆపేసి ఆటో నడిపిస్తుంటాడు. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసుకుని బి.టెక్‌లో జాయిన్ అవుతుంది. కొత్త పరిచయాలు వైష్ణవిలో మార్పుకు కారణం అవుతాయి. విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గర అవుతుంది. పబ్బులో అతడితో రొమాన్స్ చేస్తుంది. కాలేజీలో కుర్రాడితో రొమాన్స్ విషయం ఆనంద్‌కు తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు.. ఆ తర్వాత ఆనంద్, విరాజ్.. ఇద్దరిలో వైష్ణవి ఎవరిని ప్రేమించింది? చివరికి ఏమైంది? అనేది సినిమా స్టోరీ..
మూవీ విశ్లేషణ..
ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే హీరోయిన్, నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది. (Baby Movie Review) దాదాపు అందరికీ స్కూల్, కాలేజ్ డేస్ లో లవ్ స్టోరీస్ ఉండే ఉంటాయ్. ఇక ఈ సినిమాలో ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ కి తగ్గట్టు బయట జరుగుతున్న ఆ కథలు అన్నీ కనిపించాయి. కథలో బలమైన సన్నివేశాలను, హృదయాన్ని హత్తుకునేలా సాగే ఎమోషనల్ క్యారెక్టర్లను రాసుకున్నారు. ప్రీ ఇంటర్వెల్ వరకు ‘బేబీ’ కథ నిదానంగా సాగుతుంది. అయితే.. మధ్యలో మంచి పాటలు మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర అసలు కథ, కథలో కాన్‌ఫ్లిక్ట్ మొదలైంది. స్కూల్ రోజుల నుంచి ఘాడంగా ప్రేమించిన ఒకరు ఒకవైపు.. కాలేజ్ లో తనకి సపోర్ట్ గా నిలుస్తూ ప్రేమిస్తున్న మరొకరు ఇద్దరి బలమైన ప్రేమల మధ్య పరెత్తి ఒక్కరి హార్ట్ ని మూవీ టచ్ చేసింది. అయితే టాలీవుడ్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కొత్త కాదు.. కానీ ఈ సినిమాని నడిపించిన తీరు మాత్రం కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది.
ప్రపంచం, ఫాస్ట్ కల్చర్ యువతలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఎలాంటి వారినైనా ఎలా మార్చేస్తుంది? అమాయకులను సైతం ఎంతగా కన్నింగ్‌గా మార్చేస్తుంది అనే అంశాలకు ఈ సినిమా అద్దం పడుతుంది. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి ప్రధాన బలం. యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈలలు వేసే సీన్లకి కొదవలేదు. సాయి రాజేష్ రచనలో కొన్ని మాటలు థియేటర్లలో ఆటం బాంబుల్లా పేలతాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీద అభిమానాన్ని కూడా చూపించారు. అయితే స్లో నెరేషన్ సినిమాకి పెద్ద మైనస్. ప్రారంభం నుంచి సినిమా మొత్తం స్లోగా సాగుతుంది. దీంతో చాలా వరకు బోర్ ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. ఎంత సేపు అక్కడక్కడే సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అస్సలు ముందుకు సాగడం లేదనిపిస్తుంది. సెకండాఫ్ సైతం అలానే సాగుతుంది. నిడివి ఇంకొంచెం తగ్గిస్తే బావుండేది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే..
మనం ఇప్పటి వరకు చూసిన ఆనంద్ వేరు.. ఈ సినిమాలో ఆనంద్ వేరు. అతని నటనలో సహజత్వం కనిపించింది. (Baby Movie Review) బస్తీలో ఆటో డ్రైవర్లు, పదో తరగతిలో ప్రేమలో పడిన యువకులు ఎలా ఉంటారో? అలా జీవించేశాడు. ఎమోషనల్ సీన్లలో ఏడిపించేశాడు. ఒక నటుడిగా ఆనంద్ దేవరకొండ బెస్ట్ సినిమా ఇది. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో విరాజ్ అశ్విన్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోసారి మంచి నటన కనబరిచారు. బస్తీలో అమ్మాయి, గ్లామర్ గాళ్.. వైష్ణవి చైతన్య అయితే లుక్స్ పరంగా వేరియేషన్ చూపించడమే కాదు, నటిగానూ ఆకట్టుకున్నారు. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే అద్భుతంగా చేశారు. కథానాయికగా వైష్ణవి చైతన్యకు మంచి డెబ్యూ ఇది. గుర్తుండిపోయే పాత్ర చేసింది వైష్ణవి. ఇక హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ పాత్రలు పరిమితమే. ఉన్నంతలో ఇద్దరూ బాగా చేశారు. నాగబాబు నటించడం వల్ల తండ్రి పాత్రకు హుందాతనం వచ్చింది.
ముఖ్యంగా సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి ప్రయాణం పోశాయి. ఇక సాయి రాజేష్ రచన గురించి, డైలాగ్స్ గురించి.. డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఆ సంభాషణలు మనల్ని వెంటాడుతాయి అనడంలో సందేహం లేదు. నిర్మాత ఎస్కేఎన్ ఎక్కడా తగ్గలేదు.. మూవీ నిర్మాణం దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతి విషయంలో ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది.
కంక్లూజన్..
గుండెలపై గుర్తుండిపోయేలా గట్టిగా కొట్టేశారు..