Home / పొలిటికల్ వార్తలు
కేరళలో ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య దూరం మరింత పెరుగుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు, పినరయి విజయన్ సర్కారు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీసీల నియామకం విషయంలో గవర్నర్, సర్కారుకు మధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తీసుకుంది.
తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలకం రేపుతోంది. ఇకపోతే ఈ వ్యవహారం మరియు భాజపాపై వస్తున్న ఆరోపణలను భాజపా నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అధికార టీఆర్ఎస్పై స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు.
అధికార వైకాపా పార్టీని ప్రజల్లో ఎండగట్టేందుకు జనసేన పార్టీ కొత్త పంధాను ఎంచుకొనింది. విశాఖలో తన పర్యటనను అడ్డుకొని, జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైకాపా నేతలను ప్రజలే చీదరించుకొనేలా పావులు కదుపుతున్నారు.
మంత్రి రోజా ఇలాకాలో వర్గపోరు ముదిరిపాకాన పడింది. పార్టీలో కీలక నేతలు రెండుగా విడిపోయారు. పోటా పోటీ కార్యక్రమంలో రోజమ్మకు నిద్రలేకుండా చేస్తున్నారు. విసిగివేశారిన మంత్రి రోజా ఇక మహాప్రభు నువ్వే దిక్కంటూ జగన్ కు ప్రత్యర్ధి వర్గంపై ఫిర్యాదు చేశారు. దీంతో నగరి వైసిపి పార్టీలోని అంతర్గత పోరు మరోమారు బయటపడింది.
విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ముస్సోరిలో మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఇందుకేనా అంటూ ఐఏఎస్, ఐపీఎస్ ల నుద్ధేశించి మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.
హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిని విచారించకపోవడం పట్ల రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు బుధవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా లేఖ పంపారు.
అధికార పార్టీ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వైసిపి కార్యకర్తలు మనోవేదనలకు గురౌతున్నారని దర్శి వైకాపా శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వైకాపా ప్లీనరీలో మాట్లాడిన అంశాలు నేడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి.