Home / పొలిటికల్ వార్తలు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్లో తన పాత్ర లేదని లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు.
పేదల ఇండ్ల నిర్మాణంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందంటూ జనసేన పార్టీ విమర్శించింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అసమర్ధ చర్యలను ఆ పార్టీ ఆధారాలతో పేర్కొనింది.
ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో గంటలు గడిచే కొద్ది పలు కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తెరాస ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పోలీసుల ఎఎఫ్ఐఆర్ పై భాజపా న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందని రైతు సంఘాల నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను ఓ కళంకిత అధికారిగా టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. సీఐడీ అనేది ఒక ధర్మపీఠం, అందరికీ సమానంగా న్యాయం చేయాల్సి ఉందని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకొనింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై భాజపా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సీఎం జగన్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరని.. అలాంటి వ్యక్తి సోషలిస్ట్గా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్మోహర్ రెడ్డిని కలిసిన సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన రాజకీయ సినిమా టైటిల్ పేరును ఖరారు చేశారు. తాను తీయబోయే సినిమాలు ఒకటి కాదు రెండంటూ మరో బాంబు పేల్చారు.
మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన ప్రకటన చేశారు.
మొయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ ఘటనలో సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ తో ఎమ్మెల్యేల కొనుగోలు స్కాంను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.