Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణాలో సంచలనం సృష్టించిన వందల కోట్ల ఎమ్మెల్యేల కొనుగోళ్ల డీల్ వ్యవహరం హస్తినకు చేరుకొనింది. సృష్టించిన ఆడియో క్లిప్పులను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెరాస పార్టీ ప్రయత్నిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది.
ఇటీవల ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సాధించిన విజయంతో ఆ పార్టీ ముందస్తు ఎన్నికల నినాదాన్ని భుజాలపై ఎత్తుకొనింది. దీని కోసం లాంగ్ మార్చ్ ను నేడు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ కు సాగే 380కి.మీ లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులను ఎందుకు పట్టుకోవడం లేదని తెదేపా నేత బొండా ఉమ సీఎం జగన్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
తెలంగాణా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో బేరాసారాల జరిగిన ఆడియో క్లిప్పులను తెరాస పార్టీ విడుదుల చేసింది.
సొంతజిల్లా అభివృద్ధిని గాల్లోకివదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లావాసులకు క్షమాపణ చెప్పాలని భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ బీడ్ జిల్లా కలెక్టర్ రాధాబినోద్ శర్మను మద్యం తాగుతారా అని అడిగారంటూ ఒక వీడియో బయటకు వచ్చింది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథ రావునుసస్పెండ్ చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపట్నం రిషికొండ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న అర్ధ రాత్రి నుండి టీడీపీ నాయకుల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్బంధాలపై ట్వట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్లో తన పాత్ర లేదని లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు.
పేదల ఇండ్ల నిర్మాణంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందంటూ జనసేన పార్టీ విమర్శించింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అసమర్ధ చర్యలను ఆ పార్టీ ఆధారాలతో పేర్కొనింది.