Home / పొలిటికల్ వార్తలు
ఋషికొండను మొత్తం గుండు కొట్టినట్లుగా కొట్టిన కటింగ్ రాష్ట్రంలోని హెయిర్ సెలూన్ లలో ఇప్పుడు పాపులర్ గా స్టైల్ గా మారిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ శాసనసభ సెక్రటేరియట్ అతనిపై అనర్హత వేటు వేసింది.
టీడీపీ నేత పట్టాభిరామ్ ముద్దుగా బొద్దుగా రసగుల్లాలా ఉంటాడని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు.
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ నాలుగో రోజు భారత్ జోడో యాత్రను శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి ప్రారంభించారు.
తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం యుద్ధభూమిని తలపిస్తోంది. ఉపఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులతో రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు.
మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడానికి తమకు సంబంధం లేదని బండి సంజయ్ అన్నారు.
లక్షలాది మందితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్రకు లేని ఆంక్షలు, అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు
ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ పేరుతో శాసనసభ్యుల కొనుగోళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిన్నటిదినం పోలీసులకు పట్టుబడ్డ నిందుతులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ న్యాయమూర్తి ఆధారాలు లేవంటూ నిరాకరించారు. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉచితాల వంటి అంశాలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని కాంగ్రెస్ పేర్కొంది.