wife attacked: పెళ్లి అయిన రెండురోజులకే భర్త ప్రైవేట్ పార్ట్స్ పై కత్తితో దాడి చేసిన భార్య
బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ తన భర్తను అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి గాయపరిచింది. తన అత్తమామలు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

wife attacked: బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ తన భర్తను అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి గాయపరిచింది. తన అత్తమామలు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
విడిపోవడం గురించి వివాదం..(wife attacked:)
నగరంలోని న్యూ డాక్ బంగ్లా రోడ్‌లోని ఓ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని సీతామర్హికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ సూర్య భూషణ్ కుమార్, నిందితురాలు నేహా కుమారి పాట్నా నివాసిగా గుర్తించారు. వీరిద్దరూ చాలాకాలంగా రిలేషన్ లో ఉన్నారు. కుమార్ తల్లిదండ్రులు అతని పెళ్లిని మరొక మహిళతో ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్న నేహా అతడిని పాట్నాకు రమ్మని కోరింది. ఆమె ఒత్తిడితో కుమార్ జూన్ 3న పాట్నాకు వచ్చి జూన్ 5న కోర్టులో వివాహం చేసుకున్నారు. అనంతరం స్దానిక హోటల్లో బసచేసినపుడు వారిద్దిరి మధ్య విడిపోవడం గురించి పెద్ద వాదన రేగింది.
హోటల్ గదిలో బుధవారం ఈ జంట వాగ్వాదానికి దిగారు. దీనితో నేహా ఆగ్రహంతో కత్తి తీసి అతడి ప్రైవేట్ పార్ట్స్ పై పొడిచింది. దాడి తరువాత అతను గది నుండి బయటకు పరుగెత్తి సంఘటన గురించి హోటల్ సిబ్బందికి తెలియజేశాడు. నిందితుడిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. కుమార్ ప్రస్తుతం పాట్నా మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
- Nandamuri Balakrishna : బాలయ్య 108 చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. ఇగ మాస్ ఊచకోత షురూ !
- Varun Tej – Lavanya Tripathi Engagement : అఫిషియల్.. అఫిషియల్.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్