Last Updated:

Sankranti Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 52 అదనపు రైళ్లు

Sankranti Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 52 అదనపు రైళ్లు

Special trains for Sankranti-2025: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు ఆదివారం వెల్లడించింది.

ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్‌లోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళానికి రైళ్లను నడుపుతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.