Home / జాతీయం
విమానం ఆలస్యంగా బయలుదేరుతుందంటూ ప్రకటన చేస్తున్న ఇండిగో పైలట్‌ను ఒక ప్రయాణికుడు ఢీకొట్టిన ఘటనపై ఢిల్లీ పోలీసులు చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై ప్రయాణీకుడిని తప్పుబట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌కు చైర్మన్‌గా శనివారం నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.సీటు షేరింగ్ ఎజెండా, "భారత్ జోడో న్యాయ్ యాత్ర"లో పాల్గొనడం మరియు కూటమికి సంబంధించిన ఇతర విషయాలను సమీక్షించడానికి ఇండియా బ్లాక్ నాయకులు వర్చువల్ మీటింగ్‌ను ఈరోజు నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జిని ముంబైలో ప్రారంభించారు. కాగా ఈ బ్రిడ్జికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పెట్టారు. 21.8 కిలోమీటర్ల ఆరులేన్ల బ్రిడ్జికి 18వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. ఒక లక్షా 77వేల 903 మెట్రలిక్ టన్నుల ఉక్కును వినియోగించారు.
జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం నుంచి ఐదు లక్షల లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం తెలిపారు.స్వామి వివేకానంద దినోత్సవం సందర్బంగా ఒక పాఠశాలలో ఆయన మంత్రులతో కలిసి సూర్య నమస్కారాలు నిర్వహించారు.
శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో జరిగిన 'స్వచ్ఛత అభియాన్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా దేవాలయాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు (క్లీన్‌నెస్ డ్రైవ్‌లు) నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మోదీ సర్కార్ రెండవసారి పరిపాలనలో చివరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. సమావేశాల మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నెంబర్ వన్‌గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్‌తోపాటు గుజరాత్‌లోని సూరత్ కూడా క్లీనెస్ట్ సిటీ తొలి ర్యాంక్‌ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది.
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పవర్ స్టేషన్ నుంచి భారీ ఇంధనం లీకై దాని పక్కనే ప్రవహించే వాగుల్లో కలిసింది. కొన్ని చోట్ల వాగుల్లో మంటలు రేగడంతో స్దానికులు ఆందోళనకు గురయ్యారు. కాంటో సబల్, సెక్మాయి వంటి గ్రామాల మీదుగా వెళ్లే వాగుల్లో ఇంధనం కలిసిందని వారు తెలిపారు. దీనితో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారంనాడు స్పష్టం చేశారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన కి లేదని తేల్చిచెప్పారు.
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్నీ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది అయోధ్య దేవాలయం ట్రస్టు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.