Home / జాతీయం
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఉప్పల్‌ను భారత్‌కు రప్పించేందుకు దుబాయ్ అధికారులతో భారత్ అధికారులు టచ్‌లో ఉన్నారని ఈడీ తెలిపింది.
ఎయిర్ ఇండియా మంగళవారం క్యాబిన్ సిబ్బంది మరియు పైలట్ల కోసం యూనిఫామ్‌లను ఆవిష్కరించింది. ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా వీటిని రూపొందించారు.ఎయిర్‌లైన్‌లోని మహిళా క్యాబిన్ సిబ్బంది ఆధునిక టచ్‌తో కూడిన ఓంబ్రే చీరలను ధరిస్తారు, పురుషులు బంద్గాలాలు ధరిస్తారు. కాక్‌పిట్ సిబ్బంది కోసం క్లాసిక్ బ్లాక్ సూట్లను డిజైన్ చేశారు.
లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఆమెను తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని కోరే ప్రక్రియను ప్రారంభించాలని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాను ఉద్దేశించి వెళ్లి తనకోసం ఏదైనా అడగడం కంటే చనిపోవడమే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు.
బీజేపీ అధిష్టానం రాజస్థాన్ నూతన సీఎంగా భజన్‌లాల్ శర్మని అధికారికంగా ప్రకటించింది. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరు తెరమీదకు వచ్చింది. బీదియా కుమారి మరియు ప్రేమ్‌చంద్ బైర్వా లను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించారు.
కెప్టెన్ ఫాతిమా వాసిమ్ సియాచిన్ గ్లేసియర్‌లో ఆపరేషనల్ పోస్ట్‌లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠినమైన శిక్షణ పొందిన తరువాత, ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆపరేషనల్ పోస్టులో నియమిలయ్యారు.
: మధ్యప్రదేశ్ నూతన సీఎంగా మోహన్‌యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గత ప్రభుత్వంలో శివరాజ్‌సింగ్ టీమ్‌లో మోహన్ మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
'క్యాష్ ఫర్ క్వరీ' కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తన బహిష్కరణ నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ దాడులు పూర్తి చేసిన తర్వాత, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.350 కోట్లుగా తేలింది. ఒడిశాలోని డిస్టిలరీ యూనిట్లలో ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఒకే ఆపరేషన్‌లో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదే. పట్టుబడిన కరెన్సీ నోట్ల లెక్కింపు ఐదు రోజుల పాటు కొనసాగింది.
జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక అధికారాలిచ్చే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు జమ్ముకశ్మీర్ సమానమేనని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది.