Last Updated:

Union Minister Jaishankar: పీఓకే స్వాధీనానికి దేశంలో పార్టీలన్నీ కలిసిరావాలి.. కేంద్రమంత్రి జై. శంకర్

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకె ) ఇండియలో అంతర్భాగమని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్‌ జై శంకర్‌ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కలసి రావాలని కోరారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత .. ప్రజల మదిలో తిరిగి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన రెకెత్తించిందని జై శంకర్‌ న్యూఢిల్లీలో గార్గి కాలేజీ విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ అన్నారు

Union Minister Jaishankar:  పీఓకే స్వాధీనానికి దేశంలో పార్టీలన్నీ కలిసిరావాలి.. కేంద్రమంత్రి జై. శంకర్

Union Minister Jaishankar: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకె ) ఇండియలో అంతర్భాగమని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్‌ జై శంకర్‌ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కలసి రావాలని కోరారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత .. ప్రజల మదిలో తిరిగి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన రెకెత్తించిందని జై శంకర్‌ న్యూఢిల్లీలో గార్గి కాలేజీ విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ అన్నారు. పీఓకే గురించి చెప్పాలంటే పార్లమెంట్‌లో దీనిపై తీర్మానం కూడా చేశామని గుర్తు చేశారు. పీఓకే భారత్‌లో అంతర్భాగం.. భారత్‌కు అప్పగించాల్సిందేనని ఆయన అన్నారు. ఇది నేషనల్‌ కమిట్‌మెంట్‌ అని జై శంకర్‌ స్పష్టం చేశారు.

పీఓకే గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు..(Union Minister Jaishankar)

జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేయడం అసాధ్యమని అందరూ భావించారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. జమ్ము కశ్మీర్‌లో శాంతి భద్రతలు క్రమంగా అదుపులోకి వచ్చాయి. ప్రజలు జనజీవన స్రవంతిలో కలిశారు. అక్కడ అభివృద్ది జరుగుతోంది. ప్రజలు కూడా అభివృద్దిలో భాగస్వాములు అవుతున్నారన్నారు జై శంకర్‌. అయితే ఆగస్టు 2019లో జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత ప్రజల్లో ఇప్పుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై కన్నుపబడింది. పీఓకే తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని దేశ ప్రజలు కూడా ముక్త కంఠం నినదిస్తున్నారని జై శంకర్‌ అన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు సరైన నిర్ణయం..

ఎట్టకేలకు ఆర్టికల్‌ 370 రద్దు చేయడం సరైన నిర్ణయమని తేలిపోయిందన్నారు జై శంకర్‌. ఈ నెల 5న జయశంకర్‌ పీఓకే గురించి ఒడిషాలోని కటక్‌లో మాట్లాడారు. గత పాలకులు పీఓకే గురించి ప్రజలు మరిచిపోయేలా చేశారు. పీఓకే దేశంలో భాగం కాదనేలా మాట్లాడేవారు. వాస్తవానికి చూస్తే పీఓకే మన దేశంలో అంతర్బాగం.. దీనిపై పార్లమెంటులో తీర్మానం కూడా చేశాం. ఇక అసలు విషయానికి వస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌ పాకిస్తాన్‌ను పీఓకేను ఖాళీ చేమని చెప్పలేదు. దాని ఫలితమే ప్రస్తుతం ఇండియా అనుభవిస్తోందన్నారు. మన ఇంటిని మనం భద్రపర్చుకోకపోతే బయటి వారు వచ్చి దొంగతనం చేసి వస్తువులు తీసుకొనిపోతారని జై శంకర్‌ వివరించారు. మన గత పాలకులు పీఓకే మరిచిపోయేలా చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత దేశ ప్రజల ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. తిరిగి పీఓకే స్వాధీనం చేసుకోవాలనే పట్టుదల పెరిగింది. అన్నీ రాజకీయపార్టీలు ఒక తాటిపైకి వచ్చి కోల్పోయిన మన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్‌.