Home / జాతీయం
ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్నీ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది అయోధ్య దేవాలయం ట్రస్టు.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం సర్వం సిద్ధమైంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరుకానున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన మూడు కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) అలైన్మెంట్, లిక్కర్ పాలసీ మరియు ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
రూ. 820 కోట్ల మేర జరిగిన తక్షణ చెల్లింపు సేవ ( ఐఎంపిఎస్) కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటకతో సహా దాదాపు 13 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ సిస్టమ్‌లు, ఇమెయిల్ ఆర్కైవ్‌లు మరియు డెబిట్/క్రెడిట్ కార్డులు వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను రికవరీ చేయడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు మరియు బ్యాంక్ అధికారులతో సహా నిందితుల ప్రాంగణాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటించారు.విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మిసా భారతి, హిమా యాదవ్, హృద్యానంద చౌదరి, అమిత్ కత్యాల్ పేర్లు ఉన్నాయి. ఛార్జిషీట్లో రెండు సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. రెపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. బిల్కిస్ పిటీషన్ కు విచారణ అర్హత ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 11 మంది నిందితులను విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్‌లోని పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని దాటింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత కక్ష్యకి చేరుకుంది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు చెందిన పూర్వీకుల ఆస్తుల్లో రెండింటిని శుక్రవారం రూ.2.04 కోట్లకు వేలం వేశారు. స్మగ్లర్లు మరియు విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 ప్రకారం వేలం జరిగింది, ఇది స్మగ్లర్లు అక్రమంగా సంపాదించిన ఆస్తులు మరియు ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది.