Home / జాతీయం
విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులు ఏమన్నా పడే రోజులు పోయాయ్. ఒకప్పుడు బెత్తంతో భయం చెప్పినా కిక్కురుమనకుండా విద్యనభ్యసించడం చూశాం కానీ ఇప్పుటి కాలం విద్యార్థులైతే అందుకు భిన్నంలెండి. తరగతి విద్యార్థుల ముందు టీచర్ తిట్టాడని నామోషీగా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆ కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు తెగబడ్డాడు. నాటు తుపాకీతో టీచర్‌ను వెంబడించిన మరీ ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ప్రతిపక్షాలన్నీ సిద్దమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీహార్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమవనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చైల్డ్ ఫోర్నోగ్రఫీ పై కొరఢా ఝళిపించింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, 56 లోకేషన్లలో ఏక కాలంలో దాడులు జరిపింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆన్లైన్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసులు వెలుగు చూడ్డంతో సీబీఐ ఆపరేషన్ మెగాచక్రకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల బాటలోనే హర్యానాలోని మనేసర్‌లో శుక్రవారం ఓ గ్యాంగ్‌స్టర్ ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మనేసర్ గ్యాంగ్‌స్టర్ సుబే సింగ్ గుజ్జర్ అక్రమ ఇంటిని ధ్వంసం చేసింది.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముంబైలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి 'ప్లాన్ 2047' అనే బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకుంది. పిఎఫ్ఐ మరియు దాని 'దేశ వ్యతిరేక' కార్యకలాపాల పై దేశవ్యాప్తంగా అణిచివేతలో భాగంగా ఈ దాడి జరిగింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు, 19 ఏళ్ల అంకితా భండారీ హత్యకు సంబంధించి అరెస్టయిన బిజెపి నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిషికేశ్‌లోని వనతార రిసార్ట్ కూల్చివేసారు.
కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర 17వ రోజుకు చేరుకొనింది. ఈ నెల 30న కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపధ్యంలో కర్ణాటక పిసిసి తగిన ఏర్పాట్లు చేసింది. కర్ణాటకలో చేపట్టే జోడో యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు పాల్గొననున్నారు
ఓ రాష్ట్రానికి చెందిన సీఎం కుర్చీలో ఆయన కుమారుడు ఆశీనుడైనాడు. వెనుకభాగాన సీఎం ఫోటో ముందు వున్న కూర్చోలో కూర్చొన్న ఆ కుమారుడు చేస్తున్న వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారిన ఆ సీన్ మహారాష్ట్రాలో చోటుచేసుకొనింది.
బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని బాలికల పాఠశాలలో మురికిగా ఉన్న మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేస్తున్న వీడియో ఎంపీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది.