Home / జాతీయం
:జార్ఖండ్ మంత్రి అలమ్‌గిర్ ఆలమ్ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.
మన దేశంలో భర్తలు భార్యలను చిత్రహింసలకు గురి చేసే ఘటనలు కొకొల్లలు.. అదే భార్య భర్తను చిత్ర హింసలకు గురి చేసే ఘటనలు ఎప్పుడో అసాధారణంగా చోటు చేసుకుంటాయి. ఒక వేళ తన భార్య తనను టార్చర్ చేస్తోందని చెప్పినా.. ఎవరూ నమ్మరు... కావాలనే భార్యపై అపవాదు వేస్తున్నాడని భర్తనే అనుమానించడం మన దేశంలో సహజం.
: ఓటు హక్కుపై అధికారులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగానే ఉంటోంది. నిరక్షరాస్యుల సంగతి అలా ఉంచితే విద్యావంతులు కూడా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. పోలింగ్ నాడు సెలవుదినం కావడంతో ఇళ్లల్లోనే కాలక్షేపం చేయడం, ఇతరత్రా వ్యాపకాలతో మునిగితేలుతున్నారు.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్‌తో కూడుకున్న విషయం తెలిసిందే. అయితే ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా గురించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి బాగా తెలిసే ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య రేఖ కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఆమె కూడా స్టాక్‌లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బాగానే అనుభవం సంపాదించారు.
కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేప్స్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇక ప్రజ్వల్ జర్మనీ పారిపోగా.. ఆయన తండ్రి హెచ్డీ రేవన్నను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జనతాదళ్ (సెక్యూలర్ ) చీఫ్ హెచ్డి-కుమారస్వామి పోలీసులపై తన అక్కసును వెళ్లగక్కారు.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరాన్ని పనికిరానిదిగా వ్యాఖ్యానించారు. రామ మందిరం వాస్తు ప్రకారం నిర్మించబడలేదని ఆయన అన్నారు.నేను ప్రతిరోజూ రాముడిని పూజిస్తాను. రామనవమిపై కొంత మంది పేటెంట్ చేశారు. అయోధ్యలోని రామ మందిరం వాస్తు ప్రకారం సరిగా లేదని అన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కొన్ని నవ్వు పుట్టించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఒక్కోసారి చిన్న పేరు తేడా కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇక తాజాగా జరిగిన సంఘటనకు వద్దాం. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల మూడవ విడత పోలింగ్ మంగళవారం నాడు జరుగనుంది. అయితే ఈ విడతలో ఎంత మంది సంపన్నులు బరిలో ఉన్నారు. ఎంత మంది నేరస్తులు ఉన్నారో పరిశీలిద్దాం. మూడో విడతలో బీజేపీ మొత్తం 82 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది.
దేశంలోని వైస్‌చాన్సలర్లు, విద్యావేత్తలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై భగ్గుమంటున్నారు. ఆయనకు బహిరంగంగా లేఖ కూడా రాశారు. దీనికంతటికి కారణం దేశంలోని వీసీ అపాయింట్ మెంట్లు కేవలం ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు కలిగిన వారికి మాత్రమే దక్కుతున్నాయని రాహుల్ ట్విట్ చేశారు.
: కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని మాజీ కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేరా అన్నారు. కాగా ఆమె ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనపై చత్తీస్‌గఢ్ యూనిట్ మీడియా చైర్మన్ సుశీల్ ఆనంద్ శుక్లా తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు.