Home / జాతీయం
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని పలు స్కూళ్లకు ఈ- మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా స్కూళ్లకు సెలవు ప్రకటించి.. బాంబు కోసం గాలింపు చేపడితే ... అది కేవలం బెదరింపు ఈ మెయిల్ అని తేలింది
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోబోతున్న టీనేజ్ అమ్మాయి తలనరికి .. తలను తీసుకొని పారిపోయిన అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... 16 ఏళ్ల మీనా అనే టీనేజ్ బాలికను 32 ఏళ్ల వ్యక్తి గురువారం నాడు వివాహం చేసుకోవాల్సింది. అయితే అధికారులు వివాహ వేదిక వద్దకు వచ్చి పెళ్లి నిలిపివేయించారు
లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే అవకాశాల్లేవని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖనోజ్లో ఆయన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ర్టలో సుడి గాలి పర్యటన చేస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉత్తర మహారాష్ర్ట లోని నందుర్బార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఆమ్ ఆద్మీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు కేజ్రీవాల్ వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది.
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా దేశంలోని హిందువులు, జైనులు అక్షయ తృతీయ రోజును అత్యంత పవిత్ర దినంగా భావిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్బంగా బంగారం కొంటే అదృష్ట కలిసి వస్తుందని నమ్మకం భారతీయుల్లో ఉంటుంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె ) ఇండియలో అంతర్భాగమని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కలసి రావాలని కోరారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత .. ప్రజల మదిలో తిరిగి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన రెకెత్తించిందని జై శంకర్ న్యూఢిల్లీలో గార్గి కాలేజీ విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ అన్నారు
మండుటెండలతో విసిగిపోయిన దేశ ప్రజలకు శుభవార్త! త్వరలోనే దేశవ్యాప్తంగా ఎండలు తగ్గనున్నాయి. పశ్చిమ రాజస్థాన్, కేరళ తప్పించి యావత్ దేశంలో వేసవి ఎండలు తగ్గముఖం పడుతాయని భారత వాతావరణ శాఖ గురువారం నాడు వెల్లడించింది. కాగా శుక్రవారం పశ్చిమ రాజస్థాన్‌లో వేడిగాడ్పులు వీస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సైంటిస్టు సోమాసేన్ తెలిపారు.