Home / జాతీయం
అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో జాబ్-ఫర్-సెక్స్' రాకెట్ సంచలనం సృష్టించింది. మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ తన ఏడాది పదవీ కాలంలో 20 మందికి పైగా మహిళలను పోర్ట్ బ్లెయిర్ నివాసానికి తీసుకెళ్లారని, లైంగిక వేధింపులకు గురిచేసారని దీనికి బదులుగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని విచారణలో వెల్లడయింది.
ఈ నెల 28,29 రెండు రోజుల్లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు భారత శాశ్వత ప్రతినిధి, ఉగ్రవాద నిరోధక కమిటి ఛైర్మన్ చైర్ రుచిరా కాంబోజ్ తెలిపారు. ఈ సమావేశానికి యుకె విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీతోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
ఘజియాబాద్ లో మంగళవారం సాయంత్రం ఒక దాబావద్ద కారు పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇటుకతో తలను పగులగొట్టి చంపాడు.
హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
సోషల్ మీడియాలో ట్రోల్ అయిన ఓ సంఘటన పేటీఎం సీఈవో విజయ శేఖర్ శర్మను ఫిదా చేసింది. ఆర్ధిక మదుపుపై ఓ చిన్నారి చేసిన ప్రసంగం ఆయన్ను ఇట్టే ఆకట్టుకొనింది. అంతే ఇంకేముంది ఆయన కూడా ఆ చిన్నారి వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్లో కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ మధ్య బొగ్గు వ్యాగన్లతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 53 బోగీలు బోల్తా పడ్డాయి. వ్యాగన్లలోని బొగ్గు చిందర వందరగా పట్టాలపై పడ్డాయి. కొన్ని వ్యాగన్ల చక్రాలు ఊడి పక్కకు పడిపోయాయి.
పెరోల్ పై బయటకు వచ్చిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ యూట్యూబ్‌లో పంజాబీ వీడియో పాటను విడుదల చేశాడు.
భాషతో సంబంధం లేకుండా థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్న కాంతార మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కాంతార క్రేజ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాక కేంద్రానికి సైతం పాకిందని చెప్పవచ్చు. ఈ సినిమాను ప్రధాని మోడీ స్పెషల్ స్క్రీన్ పై చిత్ర బృందంతో కలిసి చూడాలని ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
దేశ కరెన్సీ నోట్లపై లక్ష్మీ-గణేశుడి ఫోటోలు కూడా ఉంటే అభివృద్ధికి దోహదపడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మంత్రికి విజ్నప్తి చేశారు.
డెంగ్యూ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా పండ్ల రసాన్ని ఎక్కించిన ఆరోపణలతో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గ్లోబల్ హాస్పిటల్ కూల్చివేతకు నోటీసును అందజేసారు