Home / జాతీయం
భీమా కోరెగావ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
1991 సంస్కరణలను "హాఫ్ బేక్డ్ " అంటూ కొన్ని వారాల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ బుధవారం విరుచుకుపడింది. "మాస్టర్ చెఫ్" నితిన్ గడ్కరీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను పొగడటం ద్వారా దానిని పూర్తిగా తయారు చేసారని అంది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్ మరియు జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామంలో రోడ్డుకు గ్రామ పాఠశాలలో చదివి, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్ది పేరు పెట్టారు. న్యూజల్పాయ్ గురిలోని ఒక మారుమూల గ్రామమైన దోష్ దర్గాలో రాబోయే మూడు కిలోమీటర్ల రహదారికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు దులాల్ దేబ్నాథ్ సోమవారం రోడ్డుకు శంకుస్థాపన చేసారు.
భారతదేశంలో టీవీ ఛానెళ్ల అప్‌లింక్ మరియు డౌన్‌లింక్ కోసం కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారాల కోసం పర్మిట్ హోల్డర్ల నుండి ముందస్తు అనుమతి అవసరం లేదు.
తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) సీనియర్లు జూనియర్లతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని పలువురిని షాక్ కి గురి చేసింది. బట్టలు విప్పించి మరీ వారి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు.
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే పెద్ద ఘర్షణలకు తావిస్తాయి. అయితే అక్కడ ఎవరు క్షణికావేషానికి లోనైనా కానీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే చైన్నైలో ఒకటి చోటుచేసుకుంది. బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన తగాదా భార్యకు నిప్పంటించేలా చేసింది. మరి ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో చూసేద్దాం.
పండ్లు, డ్రింక్స్‌తో మత్తుమందులు లేదా కొన్ని మత్తుపదార్థాలు కలిపి మురుగ మఠం పాఠశాలలో చదువుతున్న బాలికలను పీఠాదిపతి బెడ్రూమ్కు పంపించారు అంటూ ఈ చిత్రదుర్గ పోలీసులు చార్జిషీటు దాఖలు చేసారు
గుజరాత్‌లోని గాంధీనగర్ మరియు మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.