Home / జాతీయం
పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటూ ఉన్న నలుగురు చిన్నారులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
పరుగుల రాణి పీటీ ఉష మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక లాంఛనమైంది.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరుగులేదు కానీ 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు.
ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. వీటితో మొత్తం కేసులు 300కి చేరువయ్యాయి.
రాబోయే కేంద్ర బడ్జెట్లో సుమారు 300 నుండి 400 కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024 మొదటి త్రైమాసికంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలును విడుదల చేయనున్నట్లు చెప్పారు.
500 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయని మధుర పోలీసులు ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కోర్టుకు నివేదిక సమర్పించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రును నిందితుల్లో ఒకరిగా పేర్కొంటూ ఈడీ శనివారం కోర్టు ముందు తన మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
రిటైర్డ్ హవల్దార్ కెకె గోపాలకృష్ణన్ నాయర్ నవంబర్ 23న 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అతనికి ఆర్మీ అధికారులు చేసిన సత్కారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మరియు జూన్ నెలలకు సంబంధించి జీఎస్టీ నష్టపరిహారంగా కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు రూ. 17,000 కోట్లు విడుదలచేసింది.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలో ఈ -కోర్ట్ ప్రాజెక్ట్ కింద పలు కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించారు.