Home / జాతీయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు (సోమవారం) కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాలతో పాటు పలువురు బీజేపీ
కేరళలోని కోజికోడ్‌లో ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సహ-ప్రయాణికుడికి నిప్పంటించడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు చనిపోగామరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కేరళలోని ఎలత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఒక ఏళ్ల చిన్నారి మరియు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.
సోమవారం జార్ఖండ్‌లోని ఛత్రాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మావోయిస్టులపై రూ.25 లక్షలు చొప్పున ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి అక్రమ నిర్మాణాలను సోమవారం బుల్డోజర్లతో కూల్చివేసారు. శ్రీరామనవమి సందర్బంగా ఇక్కడ మెట్ల బావి కూలి 36 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనితో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టేందుకు సోమవారం ఉదయం పెద్దఎత్తున మున్సిపల్, పోలీసు అధికారులు ఆలయానికి చేరుకున్నారు.
యుపిఎ హయాంలో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌పై తాజా దాడిలో భారతీయ జనతా పార్టీ ఆదివారం 'కాంగ్రెస్ ఫైల్స్' మొదటి ఎపిసోడ్‌ను విడుదల చేసింది.ఈ వీడియో తొలి ఎపిసోడ్‌ను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్ పంపిణీ పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు పది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి. పోలీసులు అందించిన సమాచారం మేరకు 18 మందిపై కేసు నమోదు చేశారు
దేశవ్యాప్తంగా గురువారం జరిగిన రామనవమి ఊరేగింపుల్లో పలు చోట్ల హింస, కాల్పులు మరియు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గురువారం చెలరేగిన ఘర్షణలు శుక్రవారం వరకు కొనసాగాయి, అవాంఛనీయ పరిస్థితులను నివారించడానికి పోలీసులు అరెస్టులు చేసి నిషేధాజ్ఞలు విధించారు.
రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం దావా వేశారు.
భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైలు ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 1న తేదీని నిర్ణయించినట్లు తెలుసుకున్నప్పుడు, కాంగ్రెస్‌లోని 'స్నేహితులు' దానిని ప్రధాని మోదీ ఏప్రిల్ ఫూల్ అని పిలుస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు.
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.