Home / జాతీయం
రోజుకు ఏదో ఓ మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారిపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె జననాంగాల్లో రాడ్ చొప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం; థరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించి, రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీయేతర అధ్యక్షుడిగా అవతరించేందుకు మార్గం సుగమం చేశారు.
కొత్త జాతీయ రహదారుల వెంట హెలిప్యాడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం 62 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.
భాగ్యనగరం ఈ పేరు తెలియని వారుండరనడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనగరంగా ఖ్యాతి నొందిన హైదరాబాద్ వివిధ రకాల ఆచార వ్యవహారాలు ఆహారాలు వింతలు విశేషాలకు నెలవని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ ఒక్కటే కాదండోయ్ ఇకపై హలీమ్ కూడా స్పెషలే. హైదరాబాద్ హలీమ్ కు అరుదైన గుర్తింపు లభించింది మరి అదేంటో తెలుసుకుందామా..
ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను ఆస్పత్రి నర్సులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
భారత్‌ను ఏకం చేయడం లక్ష్యంగా భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగుతున్నారు. రాహుల్ గాంధీ, తోటి పాదయాత్రికుల సంభాషణ యొక్క సంగ్రహావలోకనం భారత్ జోడో యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోలో షేర్ చేయబడింది.
రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్నంగా నిరసనలు చేపట్టారు. తమ సమస్యలపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో తమ నిరసనలు గుప్పించి తమిళనాడు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశారు.