Home / జాతీయం
నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచినందుకు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ మరియు ఎంజిరోడ్లోని అనేక ఇతర సంస్థలపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పబ్ లకు అనుమతించిన సమయం రాత్రి ఒంటిగంట కాగా ఈ పబ్ లు రాత్రి 1,30 వరకు తెరిచి ఉంచడం, అర్దరాత్రి బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిఫారసు మేరకు యూపీ ప్రభుత్వం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం), తహసీల్దార్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ మరియు ఇద్దరు పోలీసు అవుట్‌పోస్టు ఇన్ చార్జిలు ఉన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
ఉత్తరాఖండ్ రిషికేశ్ లోని గంగా ఘాట్ల వద్ద విదేశీ మహిళలు బికినీలు ధరించి ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పవిత్ర గంగా నదిలో స్విమ్సూట్లతో వారు ఆడుతున్న దృశ్యాలను చూపే ఫుటేజీకి వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
గత 24 గంటలుగా కురుస్తున్నభారీ వర్షాలతో ముంబై అతలాకుతలమయింది. పలు ప్రాంతాలు జలమయవమగా సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
టీ కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు.హత్రాస్ పర్యటనకు ముందు అలీఘర్‌లోని పిలాఖ్నా గ్రామంలో ఆగి, అక్కడ కూడా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.
అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.