Home / జాతీయం
Parliament: పార్లమెంట్ ఉభయ సభల్లో ఐదో రోజు శుక్రవారం గందరగోళ వాతావరణం కొనసాగింది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో రభస ఏర్పడి సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. విపక్ష సభ్యుల నిరసనలతో ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలు ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం అయిన తర్వాత లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. […]
All-Party Meeting : బీహార్‌లో శాసన సభ ఎన్నికల ముందు ఈసీ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ చేపట్టడం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వంటి అంశాలను పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్నాయి. ఆయా అంశాలపై చర్చకు విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుబడుతున్నాయి. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా […]
Prime Minister Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు ఖర్చు అయిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021 నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రధాని విదేశీ పర్యటనలకు మొత్తం ఖర్చు రూ.295 కోట్లు అని తెలిపింది. విదేశీ పర్యటనలకు ప్రధాని వెళ్లినప్పుడు వివిధ ఏర్పాట్ల కోసం అక్కడి దౌత్య కార్యాలయాలు ఎంత ఖర్చు చేశాయో వెల్లడించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ రాజ్యసభలో అడిగారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ […]
Congress holds OBC conference in Delhi: ఢిల్లీలోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ మేరకు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సామాజిక , విద్య, ఆర్థిక అభ్యున్నతి కోసం అవశ్యకత, ఓబీసీ […]
Narendra Modi Becomes 2nd Longest Serving PM In India: ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. ఇండియాలో వరుసగా అత్యధిక రోజులు భారత ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన రెండో వ్యక్తిగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటికీ 4వేల 78 రోజులు పూర్తయింది. […]
Supreme Court Rejects Plea Seeking Delimitation: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారమే డిలిమిటేషన్ సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆర్టికల్ 170(3)లోని రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేమని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల సంఖ్యను పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 175 […]
Actor Kamal Haasan Swearing in as a Rajya Sabha MP: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్లో తమిళ భాషలో ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో తోటి పార్లమెంట్ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఎంపీగా ఎన్నిక కావడం గర్వంగా […]
Human Bridge In Punjab: గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వీదులు, రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా పంజాబు రాష్ట్రంలోని మోగా జిల్లాలో ఓ రోడ్డు కొట్టుకుపోయింది. అక్కడ విద్యార్థులతో పాటు కొంతమంది చిక్కుకుపోయారు. వారందరినీ రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే వేరే దారి లేకపోవడంతో ప్రజలే వంతెనగా మారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని మల్లెయాన్ గ్రామానికి చెందిన కొందరు […]
Rajasthan School Building Collapses: రాజస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝాలవర్లో ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ పాఠశాల భవనం పై కప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది విద్యార్థులు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మొత్తం 60 నుంచి 70 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని స్థానిక గ్రామస్తులు ఆరోపించారు.
5 Killed, 20 Injured Bus Falls in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు లోయలో పడింది. వివరాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండికి 60 కిలోమీటర్ల దూరంలోని మాసెరాన్ వద్ద ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. అలాగే ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా […]