Home / జాతీయం
PM Kisan 18th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పంట సాయం కింద అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున డీబీటీ రూపంలో రూ.20వేల కోట్లు జమ అయ్యాయి. ముంబై నగరంలో అండర్ గ్రౌండ్ […]
Security forces kill 37 Maoists in encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 37 మంది మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో సీఆర్ఫీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన 1500 మంది పాల్గొన్నారని […]
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం అవసరం లేదని, పార్టీ మైనారిటీ విభాగాన్ని తొలగించాలని అన్నారు.
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు
మహారాష్ట్రలోని ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పూణెలో నకిలీ చిరునామాను సమర్పించారు. 'వైకల్య ధృవీకరణ పత్రం' అధికారికంగా యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్, పింప్రి ద్వారా జారీ చేయబడింది.
జమ్ము కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అధికారితో సహా నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన దళాలు మరియు జమ్ము అండ్ కశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్కౌంటర్ ప్రారంభమయింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లను రాష్ట్రపతి నియమించారు. వీరి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 కు చేరింది.
గుజరాత్ లో చండీపురా వైరస్‌తో ఆరుగురు చిన్నారులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. రాష్ట్రంలో ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదయ్యాయన్నారు.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలలో జరిగిన 13 అసెంబ్లీ స్దానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి10 సీట్లు, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని ఒక్కో స్దానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను సవరించింది.