Home / జాతీయం
జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసనకు దిగిన రెజ్లర్లు ఈ సాయంత్రం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు క్యాండిల్‌లైట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల గత ఏడాది గాంబియ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. . ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
UPSC Results: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన పలువురు సత్తాచాటారు.
జ్ఞానవాపి వివాదానికి సంబంధించిన మొత్తం ఏడు కేసులను కలిపి విచారిస్తామని వారణాసి జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. సోమవారం విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్‌లో ఉంచిన జిల్లా న్యాయమూర్తి ఈరోజు తన తీర్పులో సంబంధిత ఏడు కేసులను కలిపి విచారించనున్నట్లు తెలిపారు.
Manish Sisodia: దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయిన సందర్బంగా మే 30 నుంచి జూన్ 30 వరకు దేశ వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదట ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభతో ప్రారంభించాలని భావిస్తున్నారు.
బెంగళూరులో అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల నిండా విపరీతంగా చెత్త పేరుకు పోయింది. చెత్తను తొలగించలేక మున్సిపల్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ మంగళవారం ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై విరుచుకుపడ్డారు. మౌలోని మహమ్మదాబాద్‌లోని దేవ్లాస్ ఆలయంలో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
UPSC Result: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది ఫలితాలు నేడు విడుదలయ్యాయి.