Home / జాతీయం
New Parliament: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది.
Arikomban: ఇటీవలే కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఈ ఏనుగును బంధించి.. పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలిపెట్టారు. అది అక్కడి నుంచి తప్పించుకుని తమిళనాడుకు చేరుకుంది.
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28 ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిహ్కరించిన విషయం తెలిసిందే.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఓ పాఠశాల మధ్యాహ్నం భోజనంలో ఏకంగా పాము కనిపించింది. అప్పటికే భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బిహార్‌లోని అరారియాలోని స్థానికి పాఠశాలలో జరిగింది. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది.
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం లో పూర్తి స్థాయి క్యాబినెట్ కొలువు తీరింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా శనివారం మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్ పూర్తిగా సిద్ధమైంది.
CM KCR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో దిల్లీ ప్రజలను అవమానిస్తోందని అన్నారు. కేంద్రం వెంటనే.. ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Niti Aayog : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరోగ్యం, స్కిల్ డెవలెప్మెంట్, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ని సిద్దం చేయనున్నారు. నీతి అయోగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, […]
సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రతి నెల సెలవులు రావడం సాధారణమే. ఈ మేరకు మే నెల ముగియనుండడంతో.. జూన్ నెలలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది.
చిరుత పునరుద్ధరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్యానెల్ చిరుత ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షిస్తుంది మరియు పర్యావరణ-పర్యాటకానికి చిరుత నివాసస్థలాలకు అనుమతించడంపై సూచనలను అందిస్తుంది.
మే 30తో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోప్రధానికి 9 ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది.ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రశ్నలపై ప్రధాని మౌనం వీడాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.