Home / జాతీయం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్‌ను ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో కలిశారు. దాదాపు ఏడాది క్రితం మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన తర్వాత సత్యేందర్ జైన్‌ను కలుసుకోవడం ఇదే తొలిసారి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌లో నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వెలుపల మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు కూడా వీరికి మద్దతు నివ్వడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిపక్ష పార్టీల బహిష్కరణ పిలుపు మధ్య ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకంగా పరిగణించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటును ఆయన ప్రజలగొంతుగా అభివర్ణించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్ మరియు కొత్త రూ.75 నాణేలను ఆవిష్కరించారు. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత దేశ నూతన పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అంగరంగా వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా జరిపిన హోమాలు, భక్తి శ్రద్ధలతో చేసిన పూజల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, పలువురు ముఖ్యమంత్రుల, ఎంపీలు, గవర్నర్లు, తమిళనాదు ఆధీనమ్ ల మఠాధిపతులు పాల్గొన్నారు. ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నమైన రాజదండం(సెంగోల్ ) ను ప్రధాని మోదీ ఈ నూతన పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రతిష్టించారు.
:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రతి దేశం యొక్క అభివృద్ధి ప్రయాణంలో, కొన్ని క్షణాలు అజరామరంగా మారతాయి మే 28 అటువంటి రోజని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంటు ను ప్రారంభించిన సందర్బంగా మొదటిసారి ఆయన పార్లమెంట్లో ప్రసంగించారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్వీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కొనసాగుతున్న వివాదం మధ్య, లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ ) కొత్త భవనం డిజైన్‌ను శవపేటికతో పోల్చింది."ఇది ఏమిటి" అనే శీర్షికతో కొత్త పార్లమెంటు భవనం చిత్రంతో పాటు శవపేటిక చిత్రాన్ని ఆదివారం ఆర్జేడీ ట్వీట్ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం లోక్‌సభ ఛాంబర్లోని స్పీకర్ కుర్చీకి కుడి వైపున ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో చారిత్రక సెంగోల్‌ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 10, 2020న ప్రధానమంత్రి కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.
West Bengal: పెళ్లింట బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. చావుడప్పులు మోగాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. ఒకే ఇంటికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు.