HMPV Two cases in India: బెంగళూరులో మరో హెచ్ఎంపీవీ వైరస్ కేసు.. ప్రజల్లో మొదలైన భయం!
Health Ministry confirms HMPV Two cases in bangalore: దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ మొదలైంది. తాజాగా, మరో హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మరో కేసు నిర్దారణ కావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. దీంతో దేశంలో రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
అయితే, ఈ రెండు కేసులు చిన్నారులకే సోకింది. తొలుత 8 నెలలు ఉన్న ఓ చిన్నారికి సోకగా.. ఆ తర్వాత 3 నెలల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు కేసులు నమోదైనట్లు కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ వైరస్.. చైనా మ్యూటెంటా కాదా అనేదికి ఇంకా తేలలేదేని వైద్యులు వెల్లడించారు.
ఇది సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ అని భావిస్తున్నామని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని, ఆ చిన్నారులకు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదన్నారు. ఇప్పటివరకు ఆ చిన్నారులు కానీ వారి తల్లిదండ్రులు సైతం అంతర్జాతీయంగా ప్రయాణించలేదు. అయితే ఈ వైరస్ ఎలా వ్యాపించిందని వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రపంచాన్ని గజగజ వణికించిన కోవిడ్ 19 పుట్టిన చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువ వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ కారణంగా ఎంతోమంది మత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే, అదే తరహాలో ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందుతోందనే భయం అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. తాజాగా, కర్ణాటకలో రెండు కేసులు నమోదు కావడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.