Tamilisai Soundarajan : ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్టు

Tamilisai Soundarajan : తమిళనాడులో ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ హీందీ భాషపై మండిపడుతున్నారు. హీందీ భాష అనేక స్థానిక భాషలను నిర్వీర్యం చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బహిరంగంగా హీందీ భాషపై తమ వ్యతిరేకతను బయటపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డకున్నారు. ఈ సందర్భంగా తమిళిసైని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తమిళనాడులో త్రి భాష విధానానికి మద్దతుగా బీజేపీ పార్టీ ఇంటింటికీ సంతకాల సేకరణ కార్యక్రమానికి చేపట్టిన విషయం తెలిసిందే. డీఎంకే పార్టీ అఖిల పక్షాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా తమిళనాడులోని మూడు భాషల విధానానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం నుంచి త్రిభాష విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికీ సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ సంతకాల సేకరణ కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. డీఎంకే పార్టీ నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిల పక్షం భేటీని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజావ్యతిరేక, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతిభద్రతల వైఫల్యాల గురించి కోర్ కమిటీ చర్చించింది. రానున్న రోజుల్లో తమిళ ప్రజల సంక్షేమం, డీఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.