Last Updated:

Maharashtra Politics: మహాయుతి కూటమికి బీటలు.. అజిత్ పవార్ తీరుపై అనుమానాలు

Maharashtra Politics: మహాయుతి కూటమికి బీటలు.. అజిత్ పవార్ తీరుపై అనుమానాలు

Big Twist in Maharashtra Politics NCP Factions Push For Reunion Of Sharad, Ajit Pawar: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అజిత్ పవార్.. బీజేపీతో పొసగకపోవటంతో ఆ కూటమిని వీడి తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా, ఢిల్లీలో బాబాయి, ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడైన శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారని, ఈ సమావేశంలో వీరి మధ్య సయోధ్య కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాబాయి పుట్టిన రోజున..
గత డిసెంబర్‌ 12న శరద్‌ పవార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లిన అజిత్‌ పవార్‌, బాబాయిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే వీరి మధ్య రాజకీయాల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీకి కావలసిన బలం సమకూరినందున.. ఆ ప్రభుత్వంలో తమ మాట చెల్లుబాటు కావటం లేదనే భావనలో అజిత్ పవార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, శివసేన ఉద్ధవ్ వర్గం బీజేపీకి పూర్తిగా సహకరించటం, ఉద్ధవ్ కూడా క్రమంగా బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపించటంతో.. అజిత్ పవార్ ఈ అంశంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

అజిత్ పవార్‌కే పగ్గాలు..
ఒకవేళ అజిత్ పవార్ తిరిగి వస్తే.. ఆయనకే పగ్గాలివ్వాలని శరద్ పవార్ కూడా యోచిస్తున్నట్లు సమాచారం. శరద్ నిర్ణయానికి ఆయన కుమార్తె సుప్రియ మద్దతుకూడా ఉందని, అజిత్ తిరిగి వచ్చి పార్టీ పగ్గాలు తీసుకుంటే, మహారాష్ట్రలో ప్రధాన విపక్షంగా నిలిచి, రాబోయే రోజుల్లో పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశముందనేది శరద్ ఆలోచనగా చెబుతున్నారు.

అజిత్‌ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్‌ తల్లి ఆశాతాయి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పండరీపూర్‌ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబం తిరిగి ఒక్కటి కావాలని ఆమె వ్యాఖ్యానించారు. అజిత్‌ పవార్‌ తల్లి వ్యాఖ్యలపై ప్రఫుల్‌ పటేల్‌ స్పందిస్తూ, పార్టీలో విభేదాలున్నప్పటికీ, అందరికీ శరద్‌ పవార్‌పై నేటికీ ఎనలేని గౌరవం ఉందన్నారు. ఆయన తమకు తండ్రితో సమానమన్నారు.

ఇవి కూడా చదవండి: