Home / తప్పక చదవాలి
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాకు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగ్ పూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సాయిబాబాను నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది
దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నిర్మించనున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని పూర్తిచేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,890 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 64,000 గా ఉంది.
ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో కాఫీ ఎస్టేట్ యజమాని దాడితో షెడ్యూల్డ్ కులాలకు చెందిన గర్భిణీ స్త్రీ తన పుట్టబోయే బిడ్డను కోల్పోయిన సంఘటన జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్ ఏ స్కీమ్‌ను కూడా తీసుకురాలేదు. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని బాగా గుర్తించుకోవాలి. ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ లేనే లేదని ముందు మీరు నమ్మాలి.
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్‌లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.