Home / తప్పక చదవాలి
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్‌లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.
అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటల 11 నిముషాల నుండి 6 గంటల 27 నిముషాల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల 11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి.
కొన్ని సంఘటనలు చూస్తే యువతరం ఎటుపోతుందో అనిపిస్తుంది. ప్రేమలు పెళ్లిళ్లు అనేవి నేటి యువతరానికి ఆశామాషీ వ్యవహారాల్లా మారిపోతున్నాయి. పాఠశాల చదువు పూర్తి కాకుండానే లవ్వులు ఏంటో.. ఎక్కడపడితే అక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటో..? నేటి తరాన్ని చూస్తే నిజంగానే కలికాలం అనాల్సి వస్తుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓ స్కూల్ విద్యార్థినికి మరో విద్యార్థి ఏకంగా బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు.
ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన కొన్ని నియమనిబంధనలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతకాలం డీబార్ చేయనున్నట్టు పేర్కొనింది.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ధరఖాస్తు విధానం తెలుసుకుందాం.
రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లతో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించవచ్చు. ఇలాంటి వాటికే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని కూడా ముందుగానే యాపిల్ వాచ్ గుర్తించింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పోయిందనుకున్న మహమ్మారి మరోసారి విరుచుకుపడుతుంది. చైనాలో రోజురోజుకీ భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దానితో వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు పట్టణాల్లో లాక్డౌన్ విధించింది.
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విశాఖలోతన కుమార్తె, అల్లుడి కంపెనీ పేరుపై భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.