Home / తప్పక చదవాలి
రాష్ట్ర ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.తాను నిర్వర్తించబోయే శాఖలు.. తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.
విసిగించే కాల్స్‌కు మోసపూరిత కాల్స్‌కు ఇక చెక్ పడనుంది. కేంద్రప్రభుత్వం ఒత్త్తిడితో పాటు టెలికం నియంత్రణా సంస్థ (ట్రాయ్) కూడా టెలికం ఆపరేటర్లపై ఒత్తిడి తేవడంతో విధి లేని పరిస్థితిలో దేశంలోని కొన్ని ఏరియాలో కాలర్ ఐడి సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఓ యువకుడు .. తన దరఖాస్తును తిరస్కరిస్తే.. చిన్నప్పుడు ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకొను అని కండిషన్ పెట్టాడు. ఈ ఫన్నీ దరఖాస్తు ఈ నెల 13న మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాంలో షేర్ చేయడం జరిగింది.
తాజాగా అరుంధతీయ రాయ్, మాజీ కశ్మీర్ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అత్యంత కఠిన చట్టం కింది కేసు నమోదు చేయమని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. . 23 మంది ప్రయాణికులతో బయలు దేరిన టెంపో ట్రావెలర్ లోయలో పడ్డంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్‌లోని భద్రీనాథ్ జాతీయ రహదారిలో రుద్రప్రయాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో ఉండగా భర్త ప్రవీణ్‌ను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముషీరాబాద్ ఎస్ఆర్టి కాలనీకి చెందిన ప్రవీణ్ గత కొంత కాలంగా ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు.
విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. 12 పేజీల లేఖను కమిషన్ కు అందజేశారు. అందులో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం కావాలనే.. రాజకీయ కక్షతో ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. లోటస్ పాండ్‌లో రోడ్డును ఆక్రమించి వైఎస్ ఫ్యామిలీ నిర్మాణాలు చేపట్టింది.
తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫోటో తో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశించింది .
చత్తీస్‌గఢ్‌లో మారోమారు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నాడు నారాయణపూర్ జిల్లాలో అభుజమార్హా లో భద్రతాదళాలకు.. నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.