Home / తప్పక చదవాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. వీరు ఇద్దరు ఢిల్లీ వెళ్లి జైలులో ఉన్న కవితను కలుసుకుని పరామర్శించారు.
ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్ ఎక్స్ లో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు తప్ప ఈవీఎంలు కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. వై ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించి అడపాదడపా వర్షాలు కురుస్తుంటే... అదే ఉత్తరాదిన మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది.
దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఈ ఏడాది ముంబై నిలిచింది. ఇక ఆసియాలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో నిలిస్తే.. ఢిల్లీ 30వ స్థానాన్ని ఆక్రమించింది. 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేను హెచ్ఆర్ కన్సెల్టెన్సీ సంస్థ మెర్సర్ నిర్వహించింది.
మన దేశంలోని హోటళ్లలో భోజనం చేస్తుంటే ఒక్కొసారి సాంబారులో బల్లులు, బొద్దింకలు తరచూ చూస్తుంటాం. అదే ప్రస్తుతం టాటా గ్రూపు నడుపుతున్న ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
కన్నడ చాలేంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్ లీలలు ఒక్కొక్కటి నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన దర్శన్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.
తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ముస్లింలు ఈద్ -అల్ అదా .. లేదా బక్రీద్ జరుపుకున్నారు. అయితే ఈద్‌ను పురస్కరించుకుని ముస్లింలు సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలం మక్కాను దర్శించుకున్నారు.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. అయితే ఈ మొబైల్‌ఫోన్లే సంసారాలను కూడా కూలుస్తాయనే విషయం తాజా ఎపిసోడ్‌ను చూస్తే తెలిసిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి సెక్స్ వర్కర్స్‌తో తన ఐఫోన్ ద్వారా మేసేజ్ లు.. చాట్లు చేసి ఏంజాయ్ చేసేవాడు.