Home / తప్పక చదవాలి
ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ అన్నారు.శుక్ర వారం ఆయన మీడియాతో మాట్లాుతూ ఏపీ ఫలితాలతోనే మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ హింసపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది.
కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి
ఏపీలో కొత్తగా కొలువు దీరిన మంత్రలుకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వీటి్కి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ దర్మార్గుడు. కాట్నపల్లి మమత రైస్‌మిల్‌లో ఈఘటన చోటు చేసుకుంది.
ఐదేళ్లు ఎదురు లేని పాలన,తిరుగులేని విజయాలు, తనమాటే శాసనం ,తాను తలచినదే చట్టం అన్న రీతిలో కొనసాగిన జగన్ పరిపాలనకు ఆంధ్ర జనం మంగళం పాడింది తెలిసిందే .అతి దారుణ ఓటమి చవిచూసిన జగన్ ఇప్పుడు అసెంబ్లీ కి వస్తాడా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .
కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వానికి తాము ఇచ్చిన ముఖ్యమైన హామీలపై ముఖ్య మంత్రి తొలి సంతకం చేయడం అనేది వైఎస్ తో ప్రారంభమైందని చెప్పొచ్చు . 2004 లో వైఎస్ ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేసారు .
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఎలాన్ మస్క్ ఒకరు అన్న విషయం తెలిసిందే. టెస్లా కార్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టి కొనుగోలు చేసి దాన్ని ఎక్స్‌గా మార్చారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపైన తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్ పైన తొలి సంతకం చేశారు.
ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. వాస్తవానికి అసలు గడువు జూన్ 30తో ముగియాల్సి ఉండగా ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. మోసాలను తగ్గించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ చర్య లక్ష్యం.